Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాన్నాళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన ఎంట్రీపై సస్పెన్స్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోందే తప్ప వీడటం లేదు. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం. నిజానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక సోషియో ఫాంటసీ లేదా మైథాలజీ బ్యాక్‌డ్రాప్ కథతో ఈ సినిమా ప్లాన్ చేశారనే గుసగుసలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడటం లేదా ఆగిపోవడం జరిగిందని చెబుతున్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు మోక్షజ్ఞ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నందమూరి వారసుడిని లాంచ్ చేయడానికి టాలీవుడ్‌లోని పలువురు స్టార్ ప్రొడ్యూసర్లు, బడా బ్యానర్లు భారీ బడ్జెట్‌తో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. స్టోరీలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ, బాలకృష్ణ మాత్రం కొడుకు డెబ్యూ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. మొదటి సినిమానే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ లేదా హై-విజువల్ వాల్యూస్ ఉన్న సబ్జెక్ట్‌తో ఇండస్ట్రీకి తన కొడుకును పరిచయం చేయాలని బాలయ్య గట్టి పట్టుదలతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే సరైన దర్శకుడు, పక్కా స్క్రిప్ట్ కుదిరే వరకు ఎంత సమయమైనా వెయిట్ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన చూస్తుంటే, ఈ ఏడాది కేవలం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులకే పరిమితం కానుందని.. మోక్షజ్ఞ వెండితెరపై కనిపించడానికి మరికొంత కాలం ఓపిక పట్టక తప్పదని చెబుతున్నారు.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?