Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటితో ఉగాది మహోత్సవాలు ముగియనున్నాయి.. ఉదయం శ్రీస్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు సాయంత్రం నిజాలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీభ్రమరాంబికాదేవి.. అశ్వవాహనంపై ఆది దంపుతులు పూజలందుకోనున్నారు.. వాహనసేవల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ జరిపిస్తారు.. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవంతో ఉగాది ఉత్సవాలు ముగిసిపోనున్నాయి..
Read Also: Election: దక్షిణకొరియాలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
కాగా, శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 6వ తేదీ ఉగాది మహోత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే.. ఈ మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. ముఖ్యంగా కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠం బావి, భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించారు అధికారులు.. ప్రతీ ఏడాది ఉగాది సమయంలో జరిగే ఈ మహోత్సవాలకు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలు తరలివచ్చే విషయం విదితమే.. ఉగాది మహోత్సవాల సమయంలో.. శ్రీశైలం క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది.. ఎటూ చూసిన భక్తులే.. ఇక, వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే, శ్రీశైలం ఆలయానికి ఎప్పుడైనా భక్తుల అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.. కార్తీక మాసం, ఏదైనా ప్రత్యేక రోజుల్లో రద్దీ మరి ఎక్కువగా ఉంటుంది.. ఇక, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు, ఉగాది మహ్మోత్సవాలకు శ్రీశైం ఆలయం కిక్కిరిసిపోతోంది.