UAE President: కొడుకు చేతికి $260 బిలియన్ల ఆస్తులు.. వారసుడికి బాటలు వేస్తున్న UAE ప్రెసిడెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ రాత్రికి రాత్రే 260 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను తన కుమారుడు షేక్ ఖలీద్‌కు బదిలీ చేశారు. యూఏఈ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో జాయెద్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. యూఏఈ – సౌదీ అరేబియాతో వైరంలో చిక్కుకుంది, ఇదే సమయంలో జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబంలో అధికార పోరు కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు తన కుమారుడు ఖలీద్‌కు రాత్రికి రాత్రే $260 బిలియన్ల ఆస్తులను బదిలీ చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశం అవుతుంది.
READ ALSO: Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్?.. పాన్ ఇండియా స్టార్మ్ పక్కా!
Also Read
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ 260 బిలియన్ డాలర్ల సంపదను తన కుమారుడికి బదిలీ చేశారు. ఇది ఖలీద్‌కు అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందుతారని సూచిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో తర్వలోనే యూఏఈలో అధికార బదిలీ జరగవచ్చని చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ పెద్ద కుమారుడు ఖలీద్. ప్రస్తుతం ఖలీద్ ఎమిరాటీ ప్రభుత్వానికి యువరాజుగా ఉన్నారు. 1982లో జన్మించిన ఖలీద్ తొలిసారిగా 2016లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఆయన ఆయన భద్రతా అధిపతిగా నియమితులయ్యారు. 2023లో ఖలీద్ పదోన్నతి పొంది యూఏఈ యువరాజు అయ్యారు. ఖలీద్ తన ప్రాథమిక విద్యను అబుదాబిలో పూర్తి చేశారు. ఆ తర్వాత జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
నహ్యాన్ కుటుంబానికి ఎంత ఆస్తి ఉందంటే..
బ్లూమ్‌బెర్గ్ 2025లో ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నహ్యాన్ కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. పలు నివేదికల ప్రకారం.. యూఏఈ రాజకుటుంబం మొత్తం సంపద 335 బిలియన్ డాలర్లు. ఈ పాలక కుటుంబం సంపదకు చమురు వ్యాపారం ప్రధాన ఆదాయ వనరు. ఈ కుటుంబ అధిపతి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు. తాజాగా నహ్యాన్ తన $335 బిలియన్ల సంపదలో $260 బిలియన్లను తన కొడుకుకు బదిలీ చేశారు.
అధ్యక్షుడి కుటుంబంలో అధికార పోరు..
నహ్యాన్ తమ్ముడు తహ్నౌన్ జాయెద్ యూఏఈ భద్రతా అధిపతి పదవిలో ఉన్నారు. ఆయన వయస్సు దాదాపు 45 సంవత్సరాలు. తహ్నౌన్ జాయెద్‌ను యూఏఈ గూఢచారి షేక్ అని పిలుస్తారు. ఇటీవల తహ్నౌన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టోకరెన్సీలో గణనీయమైన పెట్టుబడి కూడా పెట్టారు. అధ్యక్షుడి కుటుంబంలో అధికార పోరు జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో ఈ నిర్ణయం వెలువడటంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలన రేపుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్.. తన వారసుడికి అధ్యక్షుడు కావడానికి బాటలు వేస్తున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Interesting Railway Facts: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!