Asia Cup 2024: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. సెమీస్‌కు భారత్!
- యూఏఈపై భారత్ విజయం
- అండర్-19 ఆసియా కప్ సెమీస్‌కు భారత్
- శ్రీలంకతో భారత్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (76; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (67; 51 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. డిసెంబరు 6 జరిగే సెమీస్‌లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. యూఏఈ ఓపెనర్ ఆర్యన్ సక్సేనా (9) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. యాయిన్ రాయ్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో అక్షత్ రాయ్ (26), ఏతాన్ డిసౌజా (17)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో అవుట్ కాగా.. రాయన్ ఖాన్ (35; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరును పెంచాడు. రాయన్ అనంతరం ఉద్దీష్ సూరి (16) డిఫెన్స్ ఆడేందుకే ప్రయత్నించాడు. అయితే మరో ఎండ్‌లో క్రీజులో నిలబడేవారే కరువయ్యారు. దాంతో యూఏఈ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. భారత బౌలర్లలో యుధజిత్ 3, చేతన్ శర్మ 2, హర్దిక్ రాజ్ 2 వికెట్స్ పడగొట్టారు.
Also Read
- Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
Also Read: Champions Trophy 2025: తగ్గేదేలే.. పీసీబీ డిమాండ్‌కు బీసీసీఐ కౌంటర్!
138 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలు ఆడుతూ పాడుతూ ఛేదించారు. యూఏఈ బౌలర్లకు అవకాశమే ఇవ్వకుండా దంచికొట్టారు. గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సిక్సులతో రెచ్చిపోయాడు. ఏకంగా ఆరు సిక్సులు బాదాడు. మరోవైపు మాత్రే కూడా బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో భారత్ సునాయాస విజయం సాధించింది. షార్జాలో భారత్, శ్రీలంక మధ్య సెమీస్ మ్యాచ్ శుక్రవారం ఉదయం 10.30కు ఆరంభం అవుతుంది.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!