NTV Telugu Site icon

Hyderabad: గచ్చిబౌలి పరిధిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

Road Accident

Road Accident

గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులు అమెజాన్ లో పనిచేస్తున్న వైజాగ్ కు చెందిన దేవరకుమార్ స్వామి (25) గాజులరామారంలో నివాసం ఉంటున్న వేంకన్న స్వామి (30)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.

READ MORE: Amit Shah: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)

కాగా.. ఇండియాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందే తప్పా.. ఏమాత్రం తగ్గడం లేదు. సరైన ట్రాఫిక్ష్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్స్యంగా వ్యవహరించడం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మగవాళ్లే చనిపోతున్నారు. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే బెంగళూరు నగరంలో 2023లో మొత్తం 913 ప్రమాదాలు జరగ్గా, 883 మంది మరణించారు. 2022 కంటే 2023లో ప్రమాదాలు 17 నుంచి 18 శాతం ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 770 మంది మరణించారు. వారిలో 393 మంది 21-40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఉన్నారు. గత ఏడాది బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది పురుషులేనని, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పని చేసే వయసులో ఉన్నవారేనని డెక్కన్ హెరాల్డ్ అనే ప్రైవేట్ వార్తా సంస్థ వెల్లడించింది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే సిటీలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.