చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.
అతి వేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. మాదాపూర్ పరిధిలో బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో బుల్లెట్ బైక్‌పై వేగంగా ఇచ్చిన ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డారు.
గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు.