Challan: ఇదేమీ విడ్డూరం.. సీట్‌బెల్ట్ ధరించలేదని టూ వీలర్ యజమానికి రూ.1000 జరిమానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2-Wheeler Owner In Bihar Receives Challan Of Rs 1,000 For Not Wearing Seatbelt: సాధారణంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాను విధిస్తూ ఉంటారు. బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సమతిపూర్‌లో ఈ సంఘటన జరిగిందని, ఇప్పటికే చలాన్ జమ అయినట్లు తెలిసిందని వాహనదారుడు కృష్ణకుమార్ ఝా తెలిపారు. 2020లోని చలానా మెసేజ్ ఇప్పుడు వచ్చినట్లు ఆయన తెలిపారు. అది కూడా సీట్ బెల్ట్ ధరించలేదని వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
“నా దగ్గర స్కూటీ ఉంది. ఏప్రిల్ 27న నేను బెనారస్ (వారణాసి) వెళుతున్నాను. నేను రైలులో ఉన్నప్పుడు, నా పేరుపై రూ.1,000 చలాన్ జారీ చేయబడిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను వివరాలను చూసినప్పుడు. 2020 అక్టోబర్‌లో సీట్‌బెల్ట్ ధరించనందుకు అని అందులో పేర్కొన్నారు” అని వాహనదారుడు వెల్లడించాడు. టూ వీలర్ నడిపితే సీట్‌బెల్ట్ చలానా రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. అనంతరం ట్రాఫిక్ విభాగాన్ని సంప్రదించగా.. ఏదో ఒక లోపం కారణంగా చలాన్ రూపొందించబడి ఉండవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.”కృష్ణకుమార్ ఝా అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేయబడింది. ఇప్పుడు వీటన్నింటినీ ఈ-చలాన్లుగా కవర్ చేసే ప్రక్రియలో ఉన్నాము. లోపం ఎక్కడ జరిగిందో నేను తనిఖీ చేస్తాను” అని బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ చెప్పారు.
Also Read
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
Read Also: Doctors On Strike: నిరవధిక సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు.. కారణమేంటంటే?
ఫిబ్రవరిలో ఒడిశాలో ఇదే విధమైన సంఘటన నివేదించబడింది. అభిషేక్ కర్కు తన ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు సీటుబెల్ట్ ధరించలేదని రూ. 1,000 జరిమానా విధించారు.రాజ్గంగ్పూర్ నివాసి అయిన అభిషేక్ మాట్లాడుతూ.. ఇ-చలాన్లో ఉన్న ఫోటో మరొకరిదని తనకు తర్వాత తెలిసిందన్నారు. లోపం గురించి వారిని అప్రమత్తం చేయడానికి అతను స్థానిక రవాణా అధికారులను, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్‌లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!