MLA Raja Singh : నా ఫోటోలు, నా ఇంటి లొకేషన్‌ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారు
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు
- ఇద్దరిని పట్టుకున్నభద్రతా సిబ్బంది
- మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తిరుగుతుండగా వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ) వారిని పట్టుకుని భౌతికంగా తనిఖీ చేసిన తర్వాత మంగళ్‌హాత్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి వారి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27 మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చి రెక్కీ చేశారని, నా ఇంటి ఫోటోలు & వీడియోలు తీశారని తెలిపారు. అనుమానం వచ్చి స్థానికులు వాళ్ళని పట్టుకున్నారని, అందులో మరో ఇద్దరు పరార్ అయ్యారన్నారు. స్థానికులు వారి ఫోన్ తెరిచి చూడగా నా ఫోటోలు & నా ఇంటి లొకేషన్‌ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారని, ఇద్దరు యువకులను మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారన్నారు. పోలీసుల విచారణ సాగుతోందని ఆయన తెలిపారు.
Also Read
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
Merugu Nagarjuna: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..
అంతేకాకుండా..’అయితే నేను వెంటనే ఈ విషయం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కి కాల్ చేసి చెప్పాను.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేద్దమన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.. ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నా నిందితుడి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. 2010లో కూడా నా ఇంటి వద్ద రెక్కీ చేశారు. గతంలో ISI ఏజెంట్‌ను అరెస్టు చేశారు. తరువాత కూడా చాలాసార్లు నా గురించి రెకి జరిగింది. ఇప్పుడు నా ఇంటివద్ద రెక్కీ చేసిన వారు షేక్ ఇస్మాయిల్ వయస్సు (30), మహ్మద్ ఖాజా (24) బోరబండ ప్రాంతమని తెలుస్తుంది. ఎందుకోసం నా ఇంటికి వచ్చారు విరి వెనుక ఎవరున్నారు ఏం కుట్రా జరుగుతోంది తెలియాలి.. గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పాను నాకు ఈ పోలీసులపై నమ్మకం లేదని’ అని రాజాసింగ్ అన్నారు.
తాజావార్తలు
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!