NTV Telugu Site icon

Corona Cases: హైదరాబాద్లో కరోనా హడల్.. మరో ఇద్దరికి పాజిటివ్

Corona Jn 1

Corona Jn 1

Corona Cases: రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.

Mumbai Attack: ముంబైపై 40 డ్రోన్లతో ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన ఎన్ఐఏ.. కీలక ఉగ్రవాది అరెస్ట్..

ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు కేసులు బయటపడ్డాయి. నిన్న (బుధవారం) హైదరాబాద్ లో 6 కేసులు నమోదు కాగా.. ఈ రోజు మరో రెండు కేసులు నమోదయ్యాయి. సాయంత్రం వరకు కరోనా హెల్త్ బులెటిన్ విడుదల కానుంది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కేసులు నమోదయ్యాయో తెలుస్తుంది. కాగా.. తాజాగా నమోదైన కొవిడ్ కేసులు ఫీవర్ హాస్పిటల్ లో నమోదైనవిగా గుర్తించారు వైద్యాదికారులు. నాలుగు శాంపుల్స్ టెస్ట్ కి పంపితే.. రెండు పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు. జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపుల్స్ ను పుణెకు పంపారు.

Karimnagar: బీఆర్ఎస్‌లో ముదిరిన వార్.. మాజీ మేయర్‌పై మేయర్ ఫైర్

Show comments