NTV Telugu Site icon

Dubai: షార్జా అగ్నిప్రమాదంలో రెహమాన్ దగ్గర పని చేసిన సౌండ్ ఇంజనీర్ మృతి

Dki

Dki

గత గురువారం రాత్రి యూఏఈ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో షార్జా అల్ నహ్దా రెసిడెన్షియల్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురు మృతిచెందగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఇటీవలే వివాహమైన ముంబైకి చెందిన నవ వధువు ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్‌గా పని చేసిన మైఖేల్ సత్యదాస్ కూడా ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు సత్యదాస్ సోదరుడు సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని తెలియజేశాడు.

గత గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దాలో 750 అపార్ట్‌మెంట్లతో కూడిన 39 అంతస్తుల టవర్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ముంబైకి చెందిన నవ వధువు మృతి చెందడం.. ఆమె భర్త ప్రాణాలతో కొట్టిమిట్టాడడం హృదయాలను కలిచివేసే సంఘటన. ఇక మైఖేల్ సత్యదాస్ అయితే.. సంగీత దర్శకుడు రెహమాన్‌తో పాటు అనేక మంది కళాకారుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది.

ఇది కూడా చదవండి: Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?

తన సోదరుడు మైఖేల్ సత్యదాస్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం.. దీన్ని జీర్ణించుకోలేని విషయమని మైఖేల్ సత్యదాస్ సోదరుడు ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో దుఖంతో ఉన్నామని.. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. మైఖేల్ ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉంటాడని ఎక్స్‌లో ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ వ్రాసుకొచ్చాడు. మైఖేల్ సత్యదాస్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో డీహెచ్‌బీ లైవ్‌లో ఉద్యోగిగా ఉన్నాడు. 2022లో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో మైఖేల్ కుటుంబ సభ్యుడయ్యాడని DXB లైవ్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్

ముంబైకి చెందిన మహిళ(29)కు ఫిబ్రవరిలోనే వివాహం అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. ఇక ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ మేరకు మృతురాలి స్నేహితుడు సోషల్ మీడియాలో తెలియజేశాడు. అలాగే భారత కాన్సులేట్ జనరల్ కూడా వారి మరణాలను ధృవీకరించింది. పలువురు గాయపడినట్లుగా కూడా పేర్కొంది. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు..’ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ స్పీచ్..!