NTV Telugu Site icon

Bihar: విగ్రహ నిమజ్జనంలో అపశృతి.. చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి

Bihar Died

Bihar Died

చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు నెలకొనగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read Also: Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్‌ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీజ్ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి మహిళలు పూజలు చేసినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున పూజ అనంతరం.. చిన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు డొమినియా ఖండానికి వెళ్లారు. నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేస్తుండగా ఐదుగురు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన అక్కాచెల్లెళ్లు జూలీ కుమారి(10), జ్యోతి కుమారి (8) గా గుర్తించారు.

Read Also: Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం

చెరువు లోతు ఎక్కువగా ఉండటం వలనే వారు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు బాలికలు నీటిలో మునిగిపోతున్నప్పుడు.. ఓ స్థానిక వ్యక్తి చూసి ముగ్గురు బాలికలను రక్షించాడు. మిగతా ఇద్దరిని కాపాడలేకపోయాడు. ఈ ఘటన తర్వాత.. పండుగ మరుసటి రోజే మృతుల ఇంట్లో శోకసంద్రంగా మారింది. మరోవైపు మృతుల కుటుంబాలకు ఈ ప్రమాదం జరగడం వల్ల వచ్చిన డబ్బులను అందజేయనున్నారు.