US Air Show: అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో రెండు పురాతన యుద్ధ విమానాలు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్‌షో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాలు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఎయిర్‌షోలో బోయింగ్ బీ-17 బాంబర్ విమానం, బెల్ పీ-63 కింగ్ కోబ్రా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాలి మధ్యలో రెండు విమానాలు ఢీకొనగా.. వెంటనే నేలపై పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు, సిబ్బంది అంతా చనిపోయి ఉంటారని నివేదికలు తెలిపాయి.
మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఎయిర్‌షోను వీక్షించేందుకు దాదాపు 6 వేల మంది వరకు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ షోను వీక్షిస్తున్న ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయంలో బీ-17 బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. ఇక కింగ్‌కోబ్రా విమానాలను ఈ యుద్ధంలో సోవియట్ సేనలు మాత్రమే వాడాయి. కొన్ని సెకన్లలో, విమానాలు నేలమీద పడి మంటల్లో దగ్ధమయ్యాయి. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ సంఘటనపై విచారణ జరుపుతుందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
Tamilnadu Rains: పొంగిపొర్లుతున్న డ్యామ్‌లు, నీటమునిగిన వీధులు.. తమిళనాడును ముంచెత్తిన వర్షాలు
బీ-17 నాలుగు ఇంజిన్ల బాంబర్, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై జరిగిన వైమానిక యుద్ధంలో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. వర్క్‌హోర్స్ ఖ్యాతితో ఇది ఇప్పటివరకు అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన బాంబర్‌లలో ఒకటిగా మారింది. బెల్ పీ-63 కింగ్‌కోబ్రా అనేది బెల్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా అదే యుద్ధంలో అభివృద్ధి చేయబడిన ఒక యుద్ధ విమానం. అయితే దీనిని సోవియట్ వైమానిక దళం మాత్రమే పోరాటంలో ఉపయోగించింది.
Air collision involving a B-17 bomber and smaller plane at Dallas airshow pic.twitter.com/P8YSa9fkcY
— Ryan (@breakingryan1) November 12, 2022