టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత సుధాకర్ నాయుడిని హత్య చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేశారని తెలిసింది. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
READ MORE: Minister Atchannaidu: ఆ విషయంలో రైతులకు ఆందోళన వద్దు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..
కాగా.. మరోసారి అనంతపురం టీడీపీ నేతల ఆధిపత్య పోరు పంచాయతీ అమరావతి చేరింది. అమరావతి రావాల్సిందిగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, టీడీపీ నేత సుధాకర్ నాయుడికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. తనను హత్య చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు రావడంతో సుధాకర్ నాయుడు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. అమరావతికి రావాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
