Twinkle Khanna: 50 ఏళ్ల వయసులో డిగ్రీని పొందిన ట్వింకిల్ ఖన్నా.. అక్షయ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు, పిల్లలు, హీరో సినిమా విషయాలను చూసుకుంటుంది.. అక్షయ్ సినిమా విషయాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఈమె మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.. 50 ఏళ్ల వయసులో ఆమె డిగ్రీ పట్టాను అందుకున్నారు.. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు..
సోషల్ మీడియాలో ఆమెను అభినందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, నన్ను, పిల్లలను చూసుకుంటూనే విద్యనభ్యసించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్” అని పేర్కొన్నారు. ట్వింకిల్ పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్యాగ్ చేశారు.. ఈ పోస్ట్ పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అక్షయ్ పోస్ట్ పై తాజాగా స్పందించిన ఆమె.. ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం” అని అన్నారు. 50 ఏళ్ల ట్వింకిల్.. లండన్ విశ్వవిద్యాలయం (గోల్డ్‌స్మిత్స్) నుంచి ఫిక్షన్ రైటింగ్‌లో పట్టా పొందారు. హిందీలో ‘బర్సాత్’తో 1995లో తెరంగేట్రం చేసిన ట్వింకిల్ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జాన్’, ‘దిల్ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘శీను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పారు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!