Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసారు శర్వా. కానీ అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమా చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల భారీ బడ్జెట్‌తో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘నాగబంధం’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా తమ తదుపరి చిత్రాన్ని శర్వానంద్‌తో ప్లాన్ చేస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ‘నాగబంధం’ చిత్రానికి భారీగా ఖర్చు చేసిన మేకర్స్, ఈ సారి కూడా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నారట. శర్వానంద్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది. భారతీయ పురాణేతిహాసమైన ‘మహాభారతం‘ లోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పురాణ గాథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అంతేకాకుండా ఇది ఒక భారీ మల్టీస్టారర్ కావడం విశేషం. శర్వానంద్‌తో పాటు మరో క్రేజీ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!