Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిలో మరోసారి పడింది ‘ఆర్టికల్ 370’ మూవీ. రిలీజ్ టైమ్ లోనే చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గుర్తింపు దక్కించుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. యామీ గౌతమ్ కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచిన ఈ చిత్రం, ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమాను ఇంకా చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వెతకడం ప్రారంభించారు. జూలై 18న ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చలనచిత్ర అవార్డును కైవసం చేసుకుంది. అదే సమయంలో ఈ చిత్రంలో ఎన్ఐఏ అధికారి జూనీ హక్సర్ పాత్రలో అద్భుత నటన కనబరిచిన యామీ గౌతమ్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఒకే మూవీకి ఉత్తమ సినిమా, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం సినిమాకు మరింత ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ ఏడాది అవార్డుల్లో కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డును పంచుకోగా, ‘ఆర్టికల్ 370’ ప్రధాన విజేతగా నిలిచింది.
ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. దేశ భద్రత, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతిశయోక్తులకు తావులేకుండా, సంఘటనలను సూటిగా చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. యామీ గౌతమ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో సుమారు 50 రోజుల విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం 2024 ఏప్రిల్ 19న డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉంది. విడుదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యూస్ సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి ఆదరణ పొందింది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత ‘ఆర్టికల్ 370’ బాక్సాఫీస్ ఫలితాలపై కూడా మళ్లీ చర్చ మొదలైంది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.82.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ వసూళ్లు సాధించడంతో పాటు జాతీయ అవార్డులు కూడా అందుకోవడం ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. జాతీయ అవార్డులతో మరోసారి చర్చల్లోకి వచ్చిన ‘ఆర్టికల్ 370’ను ఇంకా చూడని వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. రాజకీయ నేపథ్యంతో సాగే స్ట్రాంగ్ కంటెంట్, యామీ గౌతమ్ పవర్ఫుల్ నటన, రియల్ స్టోరీ కారణంగా ఈ చిత్రం ఇప్పటికీ చూడదగ్గ సినిమాల జాబితాలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.
- Tags
- Article 370
- cinema
- netflix
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!