Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- భారత్‌కు వ్యతిరేకంగా భారీ వ్యూహం తయారు చేస్తున్న పాక్..?
- టర్కీ నుంచి భారీగా ఆయుధాలు, డ్రోన్ల దిగుమతి..
- అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందు యుద్ధం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు భారత్‌పై యుద్ధం చేయాలని భావిస్తుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో కీలక వైమానిక స్థావరమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు టర్కీ సైనిక విమానాల రాకపోకలు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సీ-130 హెర్క్యులెస్ విమానాలు రావల్పిండిలోని నూర్ ఖాన్, కరాచీలోని మసూర్ వైమానిక స్థావరాలకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 19 నుంచి 21 వరకు టర్కీకి చెందిన C-130 విమానాలు పాకిస్తాన్‌కు వచ్చి వెళ్లాయి. దీనిని భారత నిఘా వర్గాలు అసాధారణ పరిణామంగా గుర్తించింది. ఈ విమానాల ద్వారా పాకిస్తాన్ డ్రోన్లు, డ్రోన్ సంబంధిత పరికరాలు, ఇతర సైనిక సామాగ్రి తరలించి ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే కాకుండా చైనా నుంచి కూడా భారీగా ఆయుధాల దిగుమతి జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ HQ సిరీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పొందిందనే వాదన కూడా ఉంది. అయితే, ఈ ఆయుధాలు లేదా డ్రోన్ల సరఫరాపై పాకిస్తాన్ లేదా టర్కీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
Also Read
- Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
అయితే, టర్కీ డ్రోన్లపై పాక్ ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ టర్కీ డ్రోన్లను భారత్‌పై వాడింది. వీటన్నింటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పటికే బైరక్టర్ టీబీ2 డ్రోన్లు పాక్ వద్ద ఉన్నాయి. గతంలో భారత్ తో సైనిక ఘర్షణ సమయంలో టర్కీ తన డ్రోన్ ఆపరేటర్లను కూడా పాకిస్తాన్లో మోహరించింది. ప్రస్తుతం పాక్ తన మానవరహిత వైమానిక సామర్థ్యాలను (UAV) పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఎక్కువసేపు గాల్లో ఉండగల డ్రోన్లు, లాయిటరింగ్ మ్యునిషన్ వంటి వ్యవస్థల్ని సమకూర్చుకుంటోంది.
తాజావార్తలు
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!