Tuni Rape Case: తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తుని కొండ వారి పేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లెడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజక్షన్ చేయించాలని ఇప్పటివరకు మూడుసార్లు స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. తాను పాపకు తాత అవుతానని స్కూల్ లో చెప్పాడు. మంగళవారం కూడా ఇదే విధంగా పాపను తీసుకెళ్లాడు. తొండంగి సమీపంలో పొలాల దగ్గరికి తీసుకునివెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
స్థానిక రైతులు ప్రశ్నించారు. తాను మాజీ కౌన్సిలర్ నని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశాడు. వీడియోలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన గ్రామస్థులు నారాయణరావుని చితకబాదారు. తమకు సమాచారం ఇవ్వకుండా అమ్మాయిని ఏ విధంగా పంపిస్తారని స్కూల్ దగ్గరికి వచ్చి ఆందోళన చేశారు కుటుంబీకులు. అయితే.. నిన్న నారాయణరావుని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో కిడ్నాప్ కేసు నమోదు చేశామని పోలీసుల తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళుతుండగా వాష్ రూమ్ కి అని చెప్పి వెహికల్ ఆపమన్నాడు. చెరువులోకి దూకి పారిపోదామని యత్నించాడు. గజ ఈతగాళ్లను చెరువులోకి దింపి గాలింపు చేపట్టారు పోలీసులు.. నారాయణరావు మృతదేహం చెరువులో గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భద్రత మధ్య నారాయణరావు ఏ విధంగా తప్పించుకున్నాడు అనే అంశంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.