Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tummala Nageswara Rao Meeting Over Seetarama Irrigation

Tummala Nageswara Rao : మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు పూర్తి చేయాలి

Published Date :January 7, 2024 , 8:34 pm
By Gogikar Sai Krishna
Tummala Nageswara Rao : మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు పూర్తి చేయాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ ఏడాది మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు అన్నీ పూర్తి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షసందర్భంగా సీతారామ పనుల పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా సమీక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు గారు మాట్లాడుతూ..పెండింగ్ లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలుజారీ చేశారు. అనుకున్న స్థాయిలో పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు లక్షా 60 వేల ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా పనులు పూర్తి చేయాలి. ఇప్పటికే ప్రాజెక్టుకు సుమారు రూ.7500 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కు సంబంధించి మూడు పంప్ హౌజ్ లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఏన్కూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సుమారు రూ.70 కోట్లతో ఈ పనులుపూర్తి చేస్తే వచ్చే సీజన్ లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందన్నారు.

ఇటీవల గండుగులపల్లిలో జరిగిన సమావేశంలో సమీక్షించిన అంశాలను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లగా..సంబంధిత పనులను దశల వారీగా ప్రాధాన్యతను బట్టి పూర్తిచేసి మే నెలాఖరు కల్లా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. యాతాలకుంట భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్ కు ఈ సీజన్ లోనే సాగునీరు అందించే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు. సీతారామ కాలువల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మే నెలాఖరు కల్లా అన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.ఏన్కూరు వద్ద కాలువ పనులు పూర్తి చేస్తే..అక్కడి నుంచి వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ కలిపే పనులు చేపట్టవచ్చని ..ఈ పనులకు సంబంధించి వెంటనే టెండర్లు ఆహ్వానించాలని నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. ఈ పనులు పూర్తయితే..సీతారామ ద్వారా నీరు ఎన్నెస్పీ ఆయకట్టుకు నీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. లింకు కెనాల్ పనులు పూర్తి చేస్తే..వైరా జర్వాయర్ తోపాటు లంకాసాగర్ కు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్ కు సంబంధిచి భూ సేకరణకు చెల్లించాల్సిన రూ.12కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ నిధులు చెల్లించి వెంటనే పనులు చేపడితే యాతాలకుంట ట్రంకు పనులు పూర్తి చేయవచ్చని సూచించారు. అదేవిధంగా పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాలేరు టన్నెల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ కు సైతం నీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు. పై పనులన్నీ పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్ కింద లక్షా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • telugu news
  • tummala nageswara rao

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions