Tirumala: శ్రీవారికి గరుడ సేవ.. తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలుదీరిన తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకోగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇక, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇస్తారు.. అయితే, గరుడ సేవను చూసి తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.. ఈ సాడి తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. 2 లక్షల మంది భక్తులు మాడవీధులలోని గ్యాలరిల ద్వారా గరుడ సేవ విక్షించే అవకాశం కల్పించనున్నారు.. మాడవీధుల ఉరేగింపు సమయంలో ఐదు ప్రాంతాల వద్ద క్యూ లైన్‌ల ద్వారా భక్తులకు దర్శనం కలిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి..
Read Also: Vijayashanti : వారికి సమాధానం చెప్పడం అంత అవసరం కాదు
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
మొత్తంగా గరుడ సేవ సంధర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గ్యాలరిలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించనున్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. 5 వేల మంది సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేసింది టీటీడీ.. 2700 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. భధ్రతా ఏర్పాట్లను ఇద్దరు డీఐజీలు, ఐదుగురు ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రేపు ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించారు.. నడకదారిలోనై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. తిరుమలకు విచ్చేసే మార్గాలలో వాహనాలకు టోకెన్లు అందిస్తామంటున్నారు పోలీసులు.. తిరుపతిలో మూడు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.. అలిపిరి వద్దే వాహనాల నియంత్రణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..