TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD July 2026 Hundi Income: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం జులై నెలలో నమోదైంది. శ్రీవారి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పాటు ఉదారంగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం కొత్త రికార్డును సృష్టించింది. జులై ఒక్క నెలలోనే రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా నిలిచింది.
జులై నెలలో శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దర్శన ఏర్పాట్లను టీటీడీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. శ్రీవారి సేవలు, ప్రసాదాల పంపిణీ, వసతి వంటి అంశాల్లో కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల విశ్వాసం, శ్రీవారిపై ఉన్న అపార భక్తి కారణంగానే హుండీ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈసారి జులై నెలలో నమోదైన రూ.140.28 కోట్ల ఆదాయం గత రికార్డులను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు.
Also Read
- ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
- IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
జులై నెలలో శ్రీవారి దర్శనానికి భక్తులు కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఓ సమయంలో భక్తులు సర్వదర్శనానికి 36 గంటలు కూడా వేచి ఉన్నారు. గత నెలలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు కొనసాగిస్తోంది. జులై నెలలో నమోదైన ఈ రికార్డు స్థాయి హుండీ ఆదాయం తిరుమల క్షేత్రంపై భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
తాజావార్తలు
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
-
Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..