NTV Telugu Site icon

TTD EO Syamalarao: టీటీడీలో లోపాలు గుర్తించాం.. సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం..

Ttd Eo Syamalarao

Ttd Eo Syamalarao

TTD EO Syamalarao: టీటీడీలో లోపాలను గుర్తించాం.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీటీడీ ఈవోగా భాధ్యతలు స్వీకరించే సమయంలో వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు మొదలుకోని, లడ్డూ ప్రసాదం, భక్తులకు అందించే అన్నప్రసాదాలు నాణ్యత పెంచాలని.. ఆన్ లైన్ లో జారీ చేసే దర్శన టికెట్ల జారిలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని చెప్పారు.. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత చాలా లోపాలను గుర్తించామని తెలిపారు శ్వామలరావు.

Read Also: Prank Video: ఓరి మీ దుంపలు తెగ.. నవ్వించి చంపేస్తారా ఏంటి..?

సర్వదర్శనం భక్తులకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ సరైన రీతిలో జరగడం లేదన్నారు శ్వామలరావు.. క్యూ లైనులో వేచి వున్న చంటిబిడ్డలకు పాలు అందించడం లేదు.. క్యూ లైనులో వేచివున్న భక్తులకు కనీస సమాచారం అందించే వ్యవస్థ కూడా లేనట్టు ఫిర్యాదులు అందాయి.. క్యూ లైన్‌లో నూతనంగా మూడు అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. వారంతం రద్దీ సమయంలో భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణకు ఎస్వీబీసీ సీఈవోకి భాధ్యతలు అప్పగించాం.. అన్నప్రసాద కాంప్లెక్స్‌లోని నిత్యం 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. భక్తులకు సేవలందించడానికి ఉద్యోగుల కొరత ఉంది.. కావాల్సినవారి కంటే మూడోవంతు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.

Read Also: Pakistani Terrorists: పాక్ ఉగ్రవాదులను వేటాడేందుకు 500 కమాండోలు..

ఇక, అన్నప్రసాదంలో నాణ్యత పెంపునకు సంబంధించి ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయాలను తీసుకోని మార్పులు తీసుకువస్తాం అన్నారు శ్యామలరావు.. లడ్డూ నాణ్యత పెంచడానికి నాణ్యమైన నెయ్యి సేకరణపై దృష్టి పెట్టామన్న ఆయన.. ముడిసరుకులు నాణ్యత పరిశీలనకు ఫుడ్ సేప్టి అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తూన్నం అన్నారు. ప్రైవేట్‌ హోటల్స్ ని బ్రాండింగ్ వున్న సంస్థలకు కేటాయించాలని నిర్ణయించాం.. టీటీడీకి ఆదాయం రావడంతో పాటు భక్తులకు నాణ్యమైన ఆహారం ఆందించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. సర్వదర్శనం భక్తులకు వారానికి 1.65 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. టీటీడీ ఐటీ వ్యవస్థలో అనేక లోపాలు వున్నాయి.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తూన్నాం అన్నారు. కొంత మంది భక్తులు ఒకే ఐడీతో ,ఒకే మొబైల్ నంబర్ తో వందల సార్లు టికెట్లు పొందినట్లు గుర్తించాం.. త్వరలో ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ కి ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. దళారులపై నమోదవుతున్న కేసులు పట్ల పోలిసులు సరిగ్గా స్పందించడం లేదని గుర్తించామనంటూ వ్యాఖ్యానించారు టీటీడీ ఈవో శ్యామలరావు.