IPL: నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ.. ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా మరో మ్యాచ్ జరగబోతోంది.. ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ ఢీకొనబోతోంది.. ఈ సీజన్లో ఇప్పటి వరకు రెండు జట్ల ప్రదర్శనకు పెద్ద తేడా ఏమీ లేదు.. ముంబై నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. హైదరాబాద్ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కిందినుంచి వరుసగా రెండు, మూడో స్థానాలకే పరిమితం అయ్యాయి.. అయితే, హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాబోతోందని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
Read Also: Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి.. నిన్న వర్షం కురవడంతో.. పిచ్ తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.. మరోవైపు.. మ్యాచ్‌కి వచ్చే అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా, సురక్షితంగా ఉప్పల్ స్టేడియానికి, తిరిగి గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు టీఎస్ఆర్టీ ఎండీ వీసీ సజ్జనార్.
క్రికెట్ అభిమానులారా!? #IPL మ్యాచ్ ని వీక్షించేందుకు ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి మీరు వెళ్తున్నారా!? మీ కోసమే #Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఇవాళ జరిగే #SunRisersHyderabad Vs #MumbaiIndians మ్యాచ్ కు ముందు, అనంతరం వాటిని… pic.twitter.com/NtQVejRHDo
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 18, 2023
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..