TSRTC Nursing College: అత్యాధునిక హంగులతో టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నర్సింగ్ కళాశాల నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల భవన సముదాయాన్ని సంస్థ నిర్మించింది. హైదరాబాద్ తార్నాక ఆస్పత్రి ప్రాంగణంలో నేడు (శనివారం ) నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం తరగతి గదులు, ల్యాబొరేటరీలను పరిశీలించారు. నూతన భవనంలో విద్యార్థులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read Also: Himanta Biswa Sharma: రాహుల్పై అస్సాం సీఎం సెటైర్లు.. గాంధీ పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా..?
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తార్నాక టీఎస్ఆర్టీసీ ఆస్పత్రికి అనుసంధానంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉందని, విద్యార్థులందరూ టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న నర్సింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆస్పత్రుల్లో నర్సులు కుటుంబ సభ్యుల్లాగా రోగులను పరిగణించి.. అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. చికిత్స సమయంలో రోగులకు తల్లికంటే ఎక్కువగా సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్న నర్సుల సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు.
Read Also: Vidadala Rajini: 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
తనతో పాటు సజ్జనార్ పట్టుదల, వ్యూహాత్మక నిర్ణయాలతో సంస్థ పురోభివృద్ధి సాధ్యం అవుతోందని, తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయం నాటికి ఇప్పటికి సంస్థలో గణనీయంగా నష్టాలు తగ్గుముఖం పట్టాయని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Ganesh Chaturdhi: వినాయకాయ చవితి వ్రత కథ విశేషాలు
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. నర్సింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉన్నది.. కోర్సు పూర్తి చేసిన నర్సింగ్ విద్యార్థులకు విదేశాలలోనూ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి.. అందుకే, కష్టపడి చదివి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్ల క్రితం నర్సింగ్ కళాశాలను పెట్టాలని ఆలోచించిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు కేవలం 12 నెలల కాలంలోనే నర్సింగ్ కళాశాల భవనం మెరుగైన సదుపాయాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇది గోల్డెన్ ఛాన్స్ అంటూ నర్సింగ్ విద్యార్థులు బాగా చదువుకుని అటు కుటుంబ సభ్యులకు, ఇటు సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సజ్జనార్ కోరారు.
Read Also: Tamil Nadu: కులం అడ్డుగోడలు ఛేదించారు.. తొలిసారి ఆలయ పూజారులుగా ముగ్గురు మహిళలు..
అయితే, నర్సింగ్ కళాశాల భవనాన్ని రూ.10 కోట్లతో నిర్మించారు. ఈ కళాశాల 50 మంది విద్యార్థులతో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ కాలేజ్ లో మేనేజ్‌మెంట్ కోటా 20 సీట్లలో ఆర్‌టీసీ ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా ఐదు సీట్లు కేటాయించడం జరుగుతోంది. నర్సింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?