Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్‌లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్,…
తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.
Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా…