తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని.. జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని.. అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది అని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ…
సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. కాగా.. చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదన్న విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన రాజీనామాకు సంబంధించి సత్యనారాయణ ఓ లేఖ రాశారు.