గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు తెలుసుకోవచ్చు.
READ MORE: Honeytrap: యూపీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివరాలు లీక్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్..
ఇదిలా ఉండగా.. మార్చి 10 తేదీన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. గతేడాదిలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందొచ్చు.
READ MORE: Janasena : పిఠాపురం జనసేన సభకు మూడు దారులు.. ఏ దారిలో ఎవరు వెళ్లాలంటే..?