TS TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS TET: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు నేటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్‌టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. టెట్‌కు ఇప్పటి వరకు 1,95,135 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే గడువు ఉండడంతో దరఖాస్తులు 2 లక్షలకు మించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేశారు.
Read Also: Metro Ticket Rates: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఇకపై ఆ డిస్కౌంట్స్ రద్దు..!
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. టెట్ అర్హత ఉన్నవారికే రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. పేపర్ 1 పరీక్షకు డీఈడీ అర్హతతోపాటు ఇంటర్లో జనరల్ అభ్యర్థులకైతే 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2015లోపు డీఈడీ పూర్తి చేసినవారు జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. జూన్ 12వ తేదీన టెట్ ఫలితాలు విడుదలవుతాయి.
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..