తెలంగాణలోని విద్యార్థుల స్కాలర్షిప్ అప్లికేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. ఇదివరకే అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచిన సంగతి మనకి తెలిసిందే. ఇకపోతే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి గడువు పెంచదని అర్థమవుతుంది. ఈ విషయం సంబంధించి అధికారులు కూడా మార్చి 31 చివరి తారీకు అంటూ తెలిపారు. ఒకవేళ ఇప్పటికి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈరోజు అప్లై చేసుకోవాలి అంటూ అధికారులు తెలిపారు. రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ అప్లికేషన్స్ సంబంధించి కొన్ని లింకులను అధికారులు ఇచ్చారు. ఇక వాటి వివరాలు చూస్తే..
Also Read: Spicy Chicken: నీ శాడిజం తగలెయ్య.. చికెన్ సరిగ్గా చేయలేదని టెర్రస్ పై నుంచి భార్యని తోసేసిన భర్త..!
స్కాలర్షిప్ రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులు: https://telanganaepass.cgg.gov.in/FreshRegistration202324.do లింక్ ఫై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలాగే కొత్తగా స్కాలర్షిప్ దరఖాస్తులు చేసుకోవాల్సిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/FreshRegistration202324.do లింక్ తో అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. ఇక విద్యార్థులు తమ దరఖాస్తు స్టేటస్ ను https://telanganaepass.cgg.gov.in/applicationStatus.do లింక్ పై చెక్ చేసుకోవచ్చు.
Also Read: మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ.. బలప్రదర్శనకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు!
ఇక ఈ విషయం సంబంధించి కూడా రాజకీయ పరంగా కొన్ని చర్చలు నడిచాయి. ఫీజు రియంబర్స్మెంట్ కొరకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టోకెన్ ల గడువు మార్చి 31 తో ముగియనుండగా.. గడిచిన మూడు సంవత్సరాలకు గాను రూ. 7800 కోట్లు ప్రభుత్వం కళాశాలకు చెల్లించాల్సి ఉందని బండి సంజయ్ తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.