ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 7న ఎస్సై, 28న కానిస్టేబుళ్ల పోస్టులకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రాత పరీక్షల ఫలితాలను నేడు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. ఈ మేరుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటనను విడుదల చేసింది. ఎస్సై పరీక్ష రాసిన వారిలో 46.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, కానిస్టేబుల్ పరీక్ష రాసిన వారిలో 31.39 శాతం మంది అర్హత సాధించినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది. ఇక ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్ శాఖ పరీక్షలో 43.65 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. అభ్యర్థులు తమ ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in లో చూడొచ్చని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది.