MLA’s Purchase Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీలు దాఖలు చేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీలు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ దర్యాప్తు చేసి సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి పలు విషయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రభుత్వం… సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించింది. అంతేకాకుండా.. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదని, ఓ రాజకీయ పార్టీ నేతగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై సీఎం మాట్లాడారని, సీఎం ప్రెస్‌మీట్‌ను ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగా చూడాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలను దేశప్రజలకు తెలిపే ప్రయత్నమే సీఎం వ్యాఖ్యలని, ఎఫ్ఐఆర్, పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాలపైనే సీఎం మాట్లాడారన్నారు. సీఎం మాట్లాడినవి జాతీయ పార్టీని ఉద్దేశించిన రాజకీయ వ్యాఖ్యలని, మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలతో దర్యాప్తునకు సంబంధం లేదన్నారు. ‘సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది సంబంధం లేని అంశం.
Also Read : Delhi Road Accident: అంజలి మృతిలో సంచలన విషయాలు.. కారు ఈడ్చుకెళ్లినా గుర్తించడంలో పోలీసుల విఫలం
సీఎం వీడియోలను బహిరంగపరిచారు కాబట్టి సిట్ వల్ల ఉపయోగం లేదనడం ఊహాజనితం. సీఎంకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం పొరపాటు. సీఎం ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఎవరూ వాదించలేదు. పిటిషన్లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం తగదు. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రద్దు చేయాలని పిటిషనర్లే కోరలేదు. సిట్ రద్దు చేయాలని పిటిషనర్లు కూడా కోరలేదు, నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని, సిట్ పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో చూపలేదని, యూట్యూబ్‌లో వీడియోలను పరిగణలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందనేది ఎఫ్ఐఆర్ సారాంశమని, కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదనట్లేదు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా తీర్పు ఉందని, యూట్యూబ్‌లో వీడియోలు ఉండటం నిందితులకు నష్టమెలాగో వివరించలేదు. ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమి కాదు. వీడియోలను మీడియా బయటపెట్టడం వల్ల నిందితులకు నష్టమనడం పొరపాటు. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుంది. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జ్‌షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు.’ అని ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు.
Also Read
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!