Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న మూవీ ‘హైకూ’ షూటింగ్ పార్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ‘కోర్ట్’ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆమెతో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం 4 షెడ్యూళ్లలో, 90 రోజుల పాటు రేయింబగళ్లు శ్రమించి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కంటెంట్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ చూశాకే బిజినెస్ మాట్లాడుతున్నారు. కానీ ‘హైకూ’ సినిమా విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. “ఈ సినిమా కథా బలం, అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్‌ను నమ్మి.. షూటింగ్ పూర్తి కాకముందే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరతో పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మేకింగ్ స్టేజ్ లోనే ఇలాంటి క్రేజీ డీల్ సెట్ అవ్వడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.”
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమా ఔట్పుట్ పట్ల దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేయడం ఎంటైర్ టీమ్‌కు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ మూమెంట్. కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మా నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ లతో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్‌తో ‘హైకూ’ను హృదయానికి హత్తుకునే ఒక ఎమోషనల్ డ్రామాలా, మంచి థియేట్రికల్ ఫీల్ ఇచ్చేలా అద్భుతంగా రూపొందించాం’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!