Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో మార్కెట్లో లభించే పాలు, పెరుగు, పనీర్ నుండి కూరగాయలు, మసాలా దినుసుల వరకు అన్నింటిలోనూ విపరీతంగా కల్తీ జరుగుతోంది. మన వంటింట్లో రోజూ వాడే ఎర్ర కారప్పొడి కూడా దీనికి మినహాయింపు కాదు. కారప్పొడి బరువు పెంచడానికి ఇటుక పొడి, ఇసుక, రంపపు పొట్టు, స్టార్చ్, సబ్బు పొడి వంటి హానికరమైన పదార్థాలను కలుపుతున్నారు. అంతేకాకుండా, దీనికి ఆకర్షణీయమైన ఎరుపు రంగును ఇవ్వడానికి ‘సుడాన్ రెడ్’, ‘రోడమైన్ బి’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు, ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే.. మీ ఇంట్లోనే 4 సులభమైన పరీక్షల ద్వారా కారప్పొడి అసలైనదా లేక నకిలీదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
1. వాటర్ టెస్ట్
ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని, అందులో ఒక చెంచా కారప్పొడి వేసి కాసేపు అలాగే ఉంచండి. ఒకవేళ కారం కిందకు చేరి, నీటి రంగు రసాయన రంగులా ముదురు ఎరుపు రంగులోకి మారితే, అందులో కృత్రిమ రంగులు కలిపారని అర్థం. అలాగే.. నీటిని వడకట్టిన తర్వాత మిగిలిన కారాన్ని చేత్తో తాకి చూడండి. అది రఫ్ లేదా గరుకుగా అనిపిస్తే, అందులో ఇటుక పొడి లేదా ఇసుక కలిసి ఉన్నట్లు గుర్తు.
Also Read
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
2. అరచేతిపై రుద్ది చూడటం..
కొద్దిగా కారప్పొడిని అరచేతిలో తీసుకుని బొటనవేలితో బాగా రుద్దండి. అది అరచేతిపై వెంటనే ముదురు ఎరుపు రంగును వదిలిపెడితే, అది కల్తీ కారమే. ఎందుకంటే స్వచ్ఛమైన కారప్పొడి చాలా నెమ్మదిగా, తేలికపాటి సహజ రంగును మాత్రమే ఇస్తుంది.
3. నిమ్మరసంతో పరీక్ష..
ఒక ప్లేట్లో కొద్దిగా కారప్పొడి తీసుకుని, అందులో నిమ్మరసం మరియు కొద్దిగా నీరు కలపండి. ఒకవేళ ఆ మిశ్రమం నుండి నురుగు లేదా బుడగలు వస్తే, ఆ కారంలో సబ్బు పొడి లేదా వాషింగ్ సోడా కలిపారని అర్థం. నిమ్మకాయలోని యాసిడ్ గుణం వల్ల రసాయన రంగులు కూడా వెంటనే మారిపోతాయి.
4. రుచి, సువాసన..
స్వచ్ఛమైన ఎర్ర కారప్పొడి ఘాటు చాలా తీవ్రంగా ఉంటుంది. దాని వాసన చూడగానే వెంటనే తుమ్ములు లేదా దగ్గు వస్తాయి. కల్తీ జరిగిన కారంలో ఈ ఘాటు చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అందులో ఇసుక ఉంటే, తింటున్నప్పుడు పంటి కింద కరకరలాడుతూ ఆహార రుచిని పాడు చేస్తుంది. ఈ చిన్న చిట్కాలతో కల్తీ కారాన్ని గుర్తించి, మీ కుటుంబాన్ని అనారోగ్యాల బారి నుండి రక్షించుకోండి.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!