Donald Trump: “48 గంటల్లో హోర్ముజ్ తెరవండి.. లేదంటే..” ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రపంచ మార్కెట్లకు చమురు చేరే ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా టెహ్రాన్ పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ పవర్ ప్లాంట్స్‌ను నాశనం చేస్తానని హెచ్చరించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ జలసంధిని సురక్షితం చేయాలని ట్రంప్‌పై స్వదేశంలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. “ఈ క్షణం నుంచి సరిగ్గా 48 గంటలు టైమ్ ఇస్తున్నాం. ఇరాన్ ఎటువంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా తెరవాలి. లేదంటే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుంది. వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తాం.” అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ట్రంప్ రాసుకొచ్చారు.
READ MORE: Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక హోర్ముజ్ జలసంధి అనేది ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న 55 కిలోమీటర్ల వెడల్పు గల ఒక ఇరుకైన జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రం నుంచి వేరు చేస్తుంది. ఇంధన రంగం పరంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యంత ముఖ్యమైన ప్రాంతం. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన నౌకా రవాణా మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. దీంతో ఈ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ మార్కెట్లకు చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతోంది. హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేసింది. మరోవైపు.. సంఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించడంతో మరింత ప్రమాదకరమైన దశలోకి వెళ్తున్న తరుణంలో ట్రంప్ నుంచి ఈ హెచ్చరిక వెలువడింది.
READ MORE: Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!