Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Warning Iran Protests Violence

Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

Published Date :January 9, 2026 , 7:45 am
By RAMAKRISHNA KENCHE
Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Trump Issues Strong Warning to Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. దేశంలో ఇప్పటికే నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో ప్రజలను హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీకి స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌లో అల్లర్ల సమయంలో ప్రజలపై హింస చేయడం అక్కడి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. నిరసనల్లో ప్రజల ప్రాణాలు తీస్తే అమెరికా మౌనంగా ఉండదని, అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. ఇరాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలపై హింసకు పాల్పడితే ఇరాన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.

READ MORE: Trump: ఆమె ప్రవర్తన దారుణంగా ఉంది.. ఇమ్మిగ్రేషన్ అధికారిని సమర్థించిన ట్రంప్

అసలు ఏం జరుగుతోంది?
ఇరాన్‌లో కరెన్సీ విలువ పడిపోతుండటంతో గత రెండు వారాలుగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కొనసాగుతోంది. ఇప్పటికే జరుగుతున్న నిరసనలు గురువారం రాత్రి మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో నివసిస్తున్న క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునివ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ఆయన పిలుపు తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఇరాన్ ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దింపి రోడ్లు ఖాళీ చేయించే ప్రయత్నం ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని కనీసం 50 నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. టెలిఫోన్ లైన్లను సైతం కట్ చేసింది. అయినా ప్రజలు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రోడ్లపైకి వస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump Iran statement
  • global reaction Iran unrest
  • Iran economic crisis protests
  • Iran internet shutdown
  • Iran protests news

తాజావార్తలు

  • Nani: బ్లాక్ బస్టర్‌ డైరెక్టర్‌తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!

  • Lucknow: దారుణం.. సిగరెట్‌తో కాల్చి, తలను గోడకు బాది 5 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి.!

  • LPG Supply: గ్యాస్‌ ఆన్‌లైన్‌ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..

  • Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35B‌లను తెస్తున్న అమెరికా..

  • Suryakumar Yadav: టీమిండియాలోకి అడుగుపెట్టి నేటితో ఐదేళ్లు.. కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ సందేశం!

ట్రెండింగ్‌

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కొలుపుకిని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions