Trump’s Tariff Strategy Backfires: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆధిపత్యాన్ని స్థాపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలును ఆయుధాలుగా మలుచుకున్నారు. కానీ ఆ ఆయుధం కారణంగానే ఆయన ఘోరంగా దెబ్బతింటాడని ఊహించి ఉండడు. ప్రపంచంపై భారీ సుంకాలు విధించి ఆయన ఆశించింది ఒకటైతే.. ప్రస్తుతం జరుగుతోంది మరొకటి. ఈ వాణిజ్య యుద్ధంలో ప్రపంచ దేశాలు అమెరికాకు తలొగ్గి అనుకూలంగా మారుతాయని ట్రంప్ అనుకుంటే.. ఆయా దేశాలన్ని ఇప్పుడు గతంలో కంటే మరింతగా ఒకదానికి ఒకటి చేరువగా వస్తున్నాయి. వాస్తవంగా ఈ సుంకాలు అనేవి అమెరికాకు, దాని విదేశాంగ విధానానికి ఇదో పెద్ద సమస్యగా మరబోతుంది. వాస్తవం ఏమింటే ఈ సుంకాల కారణంగా.. ఒక కొత్త ప్రపంచ క్రమం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. సుంకాల వెనక ట్రంప్ ఉద్దేశాలు ఏమున్నా.. బాధిత దేశాలన్ని బలంగా దగ్గర అవుతున్నాయనడంలో మాత్రం సందేహం లేదు. భారతదేశం, రష్యా, చైనా, బ్రెజిల్ ఇప్పటికే బ్రిక్స్ ద్వారా సమాంతర ప్రపంచ క్రమాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వాణిజ్యం, పెట్టుబడులను పెంచాలనే ఈ దేశాల ప్రణాళిక ట్రంప్, అమెరికాను క్లిష్ట పరిస్థితిలో పడేస్తుంది.. ఇది ఏ మాత్రం అమెరికాకు మంచి విషయం కాదు..
READ MORE: Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
1. మోడీ – లూలా ఫోన్ కాల్..
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం బ్రెజిల్ అధ్యక్షుడు లాయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా నుంచి భారతదేశం మాదిరిగానే బ్రెజిల్ కూడా 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు ట్రంప్ సుంకాన్ని బహిరంగంగా విమర్శించారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో ఇరుదేశాలు సహకారాన్ని పెంచుకోవడానికి రెండు దేశాల నాయకులు అంగీకరించారు.
2. చైనా నుంచి బలమైన స్పందన..
భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలపై చైనా కూడా బహిరంగంగానే స్పందించింది. భారతదేశంలో చైనా రాయబారి షు ఫీహాంగ్ సోషల్ మీడియాలో ఒక పాత సామెతను ప్రస్తావిస్తూ.. సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమే కాకుండా, WTO నియమాలను కూడా బలహీనపరుస్తుందని అన్నారు. ఈ నిర్ణయం ప్రజాదరణ పొందలేదు, స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో చైనా.. భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలతో నిలబడాలని కోరుకుంటున్నట్లు స్పష్టంగా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, 7 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాకు వెళ్తున్నారు. ఆయనకు SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది.
3. బ్రిక్స్ తిరిగి వచ్చే అవకాశం..
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ సుంకాల నిర్ణయం బ్రిక్స్ దేశాలు.. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాలను మళ్లీ ఏకం చేయగలవని పేర్కొంది. ఈ దేశాలతో పాటు ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, ఈజిప్ట్, యుఎఇ కూడా ఈ కూటమిలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ సమూహం దాని వేగాన్ని, ఐక్యతను కోల్పోతున్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు అది వాణిజ్యం, పెట్టుబడి, వారి కరెన్సీల వినియోగం వంటి అంశాలపై ఒక సాధారణ ఫ్రంట్‌ను ఏర్పరచగలదు. బ్రిక్స్ ఐక్యతతో ట్రంప్ ఎప్పుడూ కలత చెందుతునే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఇదొక షాక్ లాంటిదే అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు, బ్రిక్స్ దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తానని కూడా ఆయన బెదిరించాడు.
4. పుతిన్ – దోవల్ భేటీ..
భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. పుతిన్ కూడా రానున్న రోజుల్లో భారతదేశానికి రావచ్చని నివేదికలు ఉన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఈ నెలాఖరులో రష్యాను సందర్శించబోతున్నారు. బ్రిక్స్, ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశలో ఈ కార్యకలాపాలన్నీ ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి.
5. యూరప్ నుంచి కూడా స్వరాలు వినిపిస్తున్నాయి..
ట్రంప్ సుంకాల యుద్ధం ప్రభావం యూరప్‌లో కూడా కనిపిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని కొంతమంది రాజకీయ నాయకులు అమెరికా నుంచి మూడు డజన్ల F-35A యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్విట్జర్లాండ్‌పై అమెరికా 39% సుంకం విధించినప్పుడు దాదాపు 7.3 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల (9.1 బిలియన్ డాలర్లు) విలువైన ఈ ఒప్పందంపై ప్రశ్నలు తలెత్తాయి.
6. ప్రత్యామ్నాయ భాగస్వామ్యాల కోసం వెతుకులాట..
ది గార్డియన్ నివేదిక ప్రకారం.. అనేక దేశాలు ఇప్పుడు అమెరికా ఒత్తిడిని తగ్గించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. స్థానిక కరెన్సీలలో లావాదేవీలు, ఉమ్మడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడం వంటివి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధోరణి వేగవంతమైతే, ప్రపంచ వాణిజ్య సమీకరణాలు మారవచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్