Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Signals End Of Iran War During Ramzan Outlines Key Us Military Goals

Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Published Date :March 21, 2026 , 8:54 am
By Suresh Maddala
  • రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో 5 లక్ష్యాలను పేర్కొన్న ట్రంప్
Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇరాన్‌పై మూడు వారాలుగా కొనసాగుతున్న సైనిక చర్యలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, రక్షణ పరిశ్రమను పూర్తిగా నాశనం చేయడం అమెరికా లక్ష్యాల్లో ఒకటి అని.. అలాగే మధ్యప్రాచ్యంలో మిత్రదేశాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.

ప్రముఖ్యంగా ఐదు లక్ష్యాలను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు.

1. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు, ప్రయోగ వాహనాలు, వాటికి సంబంధించిన ప్రతిదానిని పూర్తిగా నాశనం చేయడం.
2. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని నాశనం చేయడం.
3. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం నుంచి విమాన నిరోధక ఆయుధాలను తొలగించడం.
4. ఇరాన్ అణు సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, అటువంటి పరిస్థితి తలెత్తితే అమెరికా త్వరితగతిన, సమర్థవంతంగా స్పందించగల స్థితిలో ఎల్లప్పుడూ ఉండటం.
5. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇతరులతో సహా మధ్యప్రాచ్య మిత్రదేశాలను అత్యున్నత స్థాయిలో రక్షించడం.

హోర్ముజ్..
ఇక హోర్ముజ్ జలసంధికి సంబంధించి కూడా ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని అమెరికా స్వయంగా ఉపయోగించనందున.. దాని భద్రత, నిఘా బాధ్యతను దానిని ఉపయోగించే దేశాలే చూసుకోవాలని స్పష్టంగా సూచించారు. అవసరమైతే అమెరికా సహాయం చేస్తుందన్నారు. అయితే ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత మాత్రం దాని అవసరం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.

గతగత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు దిగ్బంధించబడ్డాయి. పైగా ఖతార్‌లోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తానికి మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసేటట్లు కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు దాడులు మాత్రం ఆగలేదు. యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global energy crisis Iran
  • Hormuz Strait Crisis
  • Iran Israel US war update
  • Iran missile capability US
  • Middle East tensions news

తాజావార్తలు

  • Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..

  • Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions