Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక పరిణామం
- శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం
- ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. చాలా కాలం తర్వాత తొలిసారిగా శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రష్యాపై కొత్త ఆంక్షలు విధించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వైట్‌హౌస్ నుంచి దక్షిణ కరోలినాకు బయలుదేరే ముందు బుధవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. దౌత్య చర్చలు కీలక దశలో ఉన్నప్పుడు కొత్త ఆర్థిక ఆంక్షలు విధించడం వాటికి ఆటంకం కలిగించవచ్చని అభిప్రాయపడ్డారు.
“చాలా ముఖ్యమైన మరో విషయం.. ఉక్రెయిన్ అంశంపై ప్రస్తుతం రష్యాతో చర్చలు జరుపుతున్నాం. చాలా కాలం తర్వాత తొలిసారిగా ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని భావిస్తున్నాం. చర్చలు కీలక దశలో ఉన్నప్పుడు, ఒప్పందానికి చేరువలో ఉన్నప్పుడు ఆంక్షలు విధించకూడదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా వ్యవహారశైలిని బట్టి అవసరమైతే ఎప్పుడైనా ఆంక్షలు విధించే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆంక్షల విషయంలో తొందరపడటం లేదని ఆయన వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.
Also Read
- Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
- Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఇదే సమయంలో ఇరాన్‌కు రష్యా నుంచి పెద్దగా సహకారం అందలేదని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్యలతో ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీశామని వాదించారు. ఇరాన్ విషయంలో రష్యా, చైనా పెద్దగా పాత్ర పోషించలేదని, అందుకు తాము అభినందిస్తున్నామని చెప్పారు. రష్యా, చైనాలతో కలిసి అణ్వాయుధాల తగ్గింపుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు. అలాంటి చర్చలు జరగడం ప్రపంచానికి సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ప్రస్తుత యుద్ధరంగ పరిస్థితుల ఆధారంగా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. యుద్ధాన్ని నిలిపివేసి, దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం వాస్తవిక మార్గమని అభిప్రాయపడ్డారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. ప్రస్తుత ఫ్రంట్‌లైన్ దగ్గర యుద్ధాన్ని నిలిపివేసిన తర్వాత అమెరికా, ఐరోపా దేశాల నుంచి భద్రతా హామీలు కోరుతామని చెప్పారు.
“ప్రస్తుతం మనం యుద్ధాన్ని నిలిపివేయాలి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఇదే వాస్తవిక మార్గమని నేను భావిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి కనీసం కాల్పుల విరమణ అయినా సాధించాలన్నది ఉక్రెయిన్ ఆశయమని వివరించారు.
తాజావార్తలు
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!