Site icon NTV Telugu

Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య

Trump

Trump

భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతున్నట్లుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని.. వెంటనే ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో యుద్ధం ఆపినట్లుగా ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: JD Vance: గుడ్‌న్యూస్ చెప్పిన జేడీ వాన్స్ దంపతులు

2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా 2025 మే 10న భారతదేశం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.

ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

అయితే రెండు దేశాలను వాణిజ్య సుంకాలతో హెచ్చరించడంతో యుద్ధం ఆపాయని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతించగా.. భారత్ ఖండించింది. మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.

తాజాగా మంగళవారం వైట్ హౌస్‌లో ట్రంప్ ప్రసంగిస్తూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని.. రెండు దేశాలు అణ్వాయుధానికి సిద్ధపడుతుండగా నిరోధించినట్లు చెప్పారు. ‘‘నేను 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపాను… పాకిస్థాన్-భారతదేశం అణ్వాయుధం వైపు పయనించాయి. ఎనిమిది విమానాలను కాల్చివేశారు. నా అభిప్రాయం ప్రకారం అవి అణ్వాయుధాలను ఉపయోగించబోతున్నాయి. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇక్కడ ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్ 10 మిలియన్ల మందిని రక్షించారని.. బహుశా అంతకంటే ఎక్కువేనని ఆయన అన్నారు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇక నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై నిరాశను వ్యక్తం చేశారు. 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపినా కూడా నోబెల్ శాంతి బహుమతి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ఆపినందుకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ తనకు కృతజ్ఞత కూడా చెప్పారని గుర్తుచేశారు. అయితే నోబెల్ బహుమతితో తమకు సంబంధం లేదని నార్వే ప్రభుత్వం స్పష్టం చేసింది. అది నోబెల్ కమిటీకి సంబంధించిన విషయమని తేల్చి చెప్పింది. అయినా కూడా తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

 

Exit mobile version