NTV Telugu Site icon

Jaishankar: ట్రంప్-కమల హారిస్.. ఇద్దరిలో భారత్‌కు ఎవరు బెస్ట్‌.. జైశంకర్ సమాధానం..

S Jaishankar

S Jaishankar

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై యావత్ ప్రపంచం దృష్టి ఉంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్‌తో తలపడుతున్నారు. కాగా.. తాజాగా ఓ ఇంటర్య్వూలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి ఓ ప్రశ్న అడిగారు. ట్రంప్ కమలా హారిస్‌లో ఎవరకు బెటర్.. భారత్‌కి ఎవరు మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. మనకెందుకులే అని జైశంకర్ నవ్వుతూ చెప్పారు. తాము ఈ అంశాన్ని నిర్ధారించామని.. తమకు ఎవ్వరు అధ్యక్షులైన పర్వాలేదని స్పష్టం చేశారు. క్లింటన్, బుష్, ఒబామా, ట్రంప్, బిడెన్ ఇలా ఐదుగురు వేర్వేరు అధ్యక్షులు వారి వ్యక్తిత్వం, రాజకీయాలు చూస్తే వీరంతా ఒకరికొకరు పూర్తి భిన్నంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అన్నారు. కానీ భారతదేశంతో సంబంధాల విషయానికి వస్తే.. ప్రతి రాష్ట్రపతికి భారతదేశంతో బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈరోజుకీ రెండు దేశాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని, ఎవరు అధ్యక్షుడైనా మన వ్యూహం ఇలాగే ఉండాలని చూస్తున్నామన్నారు.

READ MORE: Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతుతో ఇరాన్ ఎమర్జెనీ మీటింగ్‌కు పిలుపు.. ఇజ్రాయెల్ ఎటాక్‌పై యూఎన్‌లో చర్చ

ఇదిలా ఉండగా.. అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు జరుగుతోంది. ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అక్కడి ఎన్నికల అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వరకు వెళ్లే అవసరం లేకుండా బ్యాలెట్‌ బాక్సునే ఓటరు వద్దకు తీసుకువెళ్తున్నారు. ఇందుకోసం మొబైల్‌ ఓటింగ్‌ వ్యాన్‌ సదుపాయాన్ని కల్పించారు. తొలిసారి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మోంట్ గోమేరీ కౌంటీలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.