Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Iran Warning Civilization End Us Israel Strikes Middle East War

Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

Published Date :April 7, 2026 , 6:23 pm
By Suresh Maddala
  • ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది
  • ట్రంప్ చివరి హెచ్చరిక
  • డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై భీకర దాడులు
  • విద్యుత్ ప్లాంట్లు, రైల్వేలపై దాడులు
Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ రాత్రికే ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే సర్వ నాశనం అవుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు సంసిద్ధత ప్రకటించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతం అవుతుందని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో ఈ రాత్రి అత్యంత కీలకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాత్రి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 47 ఏళ్ల అణచివేత, అవినీతి, మరణాలకు ఎట్టకేలకు ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించారు.

‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఇక ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది.’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.

ఇదిలా ఉంటే ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.

ఇక ఇరాన్‌లో రైల్వే సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఇరానీయులు రైళ్ల ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే రైళ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ముందుగా స్టేషన్లు, రైలు సర్వీసులను నిలిపివేసింది. ఇక రైళ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని దాడులు చేయడంతో ఇద్దరు ఇరానీయులు చనిపోయినట్లు సమాచారం.

ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా పలువురు కీలక నేతలు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.

అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. ఒప్పందం చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్‌ను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తాజాగా ఒప్పందం రద్దు కావడంతో డెడ్‌లైన్‌కు ముందుగానే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.

Keke

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news Iran war
  • global tensions Iran US
  • Iran civilization end statement
  • Iran conflict update
  • Kharg Island attack

తాజావార్తలు

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions