144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!
- యల్‌మీ నార్జో 100 లైట్ 5G ఏప్రిల్ 14న భారత్‌లో లాంచ్
- 7000mAh భారీ “టైటాన్ బ్యాటరీ” ప్రధాన హైలైట్
- MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు
- 5300mm² VC కూలింగ్ సిస్టమ్‌తో హీట్ కంట్రోల్
- 6.9 అంగుళాల LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme NARZO 100 Lite 5G: రియల్‌మీ (realme) ‘నార్జో’ (Narzo) సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతేడాది వచ్చిన నార్జో 80 లైట్ 5G కి అప్డేటెడ్ గా, మరింత శక్తివంతమైన ఫీచర్లతో నార్జో 100 లైట్ 5G (NARZO 100 Lite 5G) ను ఏప్రిల్ 14న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఇందులో భారీ 7000mAh “టైటాన్ బ్యాటరీ”ని అమర్చారు. ఈ బ్యాటరీ ఆరేళ్ల పాటు ఆరోగ్యకరమైన లైఫ్ స్పాన్ (Battery Health) కలిగి ఉంటుందని కంపెనీ ప్రత్యేకంగా చెబుతోంది. అంతేకాకుండా ఇందులో ఉన్న రివర్స్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా ఈ ఫోన్ ను పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
- TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
- OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
పనితీరు విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 5300mm² VC కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 4 ఏళ్ల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా (Smooth Performance) పనిచేసేలా దీనిని రూపొందించారు. డిస్‌ప్లే పరంగా ఇది 6.9 అంగుళాల భారీ LCD స్క్రీన్‌ను కలిగి ఉండి 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో గేమింగ్ & వీడియో వీక్షణలో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
డిజైన్ పరంగా ఈ ఫోన్ థండర్ బ్లాక్, ఫ్రాస్ట్ సిల్వర్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. ఫోన్ వెనుక భాగంలో టెక్స్‌చర్డ్ ప్యాటర్న్‌తో పాటు వర్టికల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13MP మెయిన్ కెమెరాను అందించారు. అలాగే ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్, దృఢత్వం కోసం ఆర్మర్ షెల్ (Armorshell) ప్రొటెక్షన్‌ను కూడా అందించనున్నారు.
Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఏప్రిల్ 14న లాంచ్ అయిన తర్వాత ఈ రియల్‌మీ నార్జో 100 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్ లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!