Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనదైన మేనరిజమ్స్, యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ యంగ్ స్టార్, ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)తో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో ప్రదీప్ మాట్లాడుతూ.. తన నిజజీవితంలోని ప్రేమ పాఠాలను సరదాగా పంచుకున్నారు. “నేను సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడతాను. ఇప్పటివరకు చాలా బ్రేకప్స్ చూశాను. ప్రేమ విషయంలో నాదో విచిత్రమైన పరిస్థితి.. నేను ఎవరినీ బ్లాక్ చేయను, కానీ అవతలి వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
Also Read:Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్‌నే!
Also Read
అంతేకాకుండా, తన కాలేజీ రోజుల్లో చాటింగ్ వేగం గురించి చెబుతూ.. “కాలేజీ రోజుల్లో నేను చాట్‌కు రిప్లై ఇచ్చే వేగం చూస్తే ప్రస్తుతం ఉన్న ChatGPT కూడా షాక్ అవ్వాల్సిందే” అని అన్నారు. ఇక
ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో ప్రదీప్ సరసన బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నయనతార ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య, కమెడియన్ యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభించింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 10న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..