Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు
- ట్రంప్‌నకు నెతన్యాహు షాక్
- కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షాకిచ్చారు. గాజా కోసం అమెరికా మద్దతుతో రూపొందించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనను అంగీకరించలేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించిన తర్వాతే గాజాలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లేలా హామీలు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రణాళికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
మంగళవారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన వీడియోలో నెతన్యాహు ఈ అంశంపై స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం.. హమాస్‌ను నిరాయుధీకరించడం, గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఈ ప్రణాళికను మేం పరిశీలిస్తున్నాం. వారు మాకు ఒక ముసాయిదాను పంపారు. అయితే దానికి మేం అంగీకరించలేదు. అది మా ముసాయిదా కాదు. మా అభిప్రాయాలు, సూచనలను వారికి పంపించాం’’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.
Also Read
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
అమెరికా మద్దతుతో ఏర్పాటైన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రతినిధులతో నెతన్యాహూ సోమవారం సమావేశమయ్యారు. హమాస్ నిరాయుధీకరణ పూర్తయిన తర్వాతే గాజాలో ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం ఉన్న ప్రాంతాల నుంచి ఉపసంహరణ చేపట్టాల్సి ఉంటుందని ఈ సమావేశంలో హామీలు లభించినట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందాన్ని తిరస్కరించాలంటూ నెతన్యాహుపై ఆయన పాలక కూటమిలోని అతివాద కుడిపక్ష వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రణాళికపై మరోసారి ఓటింగ్ నిర్వహించాలని ఇద్దరు అతివాద మంత్రులు మంగళవారం డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన తొలుత చర్చించిన అంశాలకు అనుగుణంగా లేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు సభ్యులుగా ఉన్న ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ట్రిప్‌లో అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాలను మోహరించే అంశం కూడా ఉన్నట్లు సమాచారం.
మంగళవారం భద్రతా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని నెతన్యాహూ భావించినప్పటికీ.. ఆ సమావేశం గురువారానికి వాయిదా పడినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు ముందు నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీలో ప్రాథమిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నెతన్యాహుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, సెటిల్మెంట్స్ మంత్రి ఒరిట్ స్ట్రూక్ మరోసారి ఓటింగ్ నిర్వహించాలని కోరడాన్ని కేవలం ఎన్నికల ప్రచార వ్యూహంగా చూడాలని ఇజ్రాయెల్‌కు చెందిన ‘మొలాద్’ థింక్‌ట్యాంక్ పరిశోధకుడు టాల్ ఎలోవిట్స్ అభిప్రాయపడ్డారు. నెతన్యాహుపై ఒత్తిడి పెంచేందుకే ఈ డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
‘‘ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి వెళ్లే పరిస్థితిని ఇజ్రాయెల్ కుడిపక్షం ఎప్పటి నుంచో వాయిదా వేయాలని ప్రయత్నిస్తోంది. కొసోవో, ఇండోనేషియా వంటి దేశాల సైనికులు గాజాలో మోహరించిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరించే తీరు భిన్నంగా ఉండే అవకాశం ఉంది’’ అని ఎలోవిట్స్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ ఒంటరిగా మారుతున్న నేపథ్యంలో.. అమెరికా మద్దతుతో రూపొందించిన ఈ ప్రణాళికను పూర్తిగా తిరస్కరించే అవకాశం ఇజ్రాయెల్‌కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దౌత్య ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మిగిలిన ప్రధాన మిత్రుడు అమెరికానేనని, అందువల్ల ట్రంప్ సూచనలను నెతన్యాహు పరిగణనలోకి తీసుకోక తప్పదని పేర్కొన్నారు.
‘‘ఈ వ్యవహారంలో నెతన్యాహూ ప్రధాన పాత్ర పోషించడం లేదు. కొన్ని ప్రతిపాదనలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం వరకు ఆయన పాత్ర పరిమితమై ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం లేదు’’ అని ఎలోవిట్స్ అన్నారు.
ఇదిలా ఉండగా.. గాజాపై దాడులను తగ్గించాలని ఇజ్రాయెల్‌పై అమెరికా చేస్తున్న ఒత్తిడి ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం పాక్షికంగా వెనక్కి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో.. గాజాలో సైనిక చర్యలను నియంత్రించాలంటూ అమెరికా ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. సైనికులు గాజాలో దాడులు నిర్వహించాలంటే సాధారణ పరిస్థితుల్లో సైన్యాధిపతి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సైనికులకు తక్షణ ప్రమాదం ఎదురైతే మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. గతంలో ప్రాంతీయ కమాండ్ అధిపతి అనుమతితో దాడులు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పుడు అనుమతి ప్రక్రియను మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై స్పందించాలంటూ ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ సైన్యం రాజకీయ నాయకత్వాన్ని సంప్రదించాలని సూచించింది. నెతన్యాహు కార్యాలయ ప్రతినిధి మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!