Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Announces End Of Iran War White House Congress

Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన

Published Date :May 2, 2026 , 7:54 am
By Suresh Maddala
  • ఇరాన్‌తో యుద్ధం ముగిసింది
  • వైట్‌హౌస్ కీలక ప్రకటన
  • ట్రంప్ సందేశాన్ని అమెరికా కాంగ్రెస్‌కు తెలిపిన వైట్‌హౌస్
Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాన్‌తో యుద్ధం ఆపేసినట్లు అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో అమెరికా దళాలు ఉన్నప్పటికీ యుద్ధం నిలిపివేసినట్లు వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసిరి.. ఈ గడువు మే 1న ముగిసింది. దీంతో ట్రంప్ సందేశాన్ని అమెరికా కాంగ్రెస్‌కు వైట్‌హౌస్ పేర్కొంది. ఏప్రిల్ 7న ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తలపై ట్రంప్ భిన్న ప్రకటనలు చేశారు. ఇరాన్‌తో వైషమ్యాలు ముగిశాయని అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ తెలిపారు. అయితే యుద్ధం కొనసాగింపుపై తన అధికారాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధమని.. 60 రోజుల అనుమతి వాదనపై ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులేకాదని ట్రంప్ ధ్వజమెత్తారు.

Also Read

  • EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
  • Pickleball Players' Plane Crash: టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
  • Iran: ఇరాన్‌లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

ఏప్రిల్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరగలేదని.. అయినా ఇరాన్‌తో ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. ఆయుధాల నిల్వలపై మా దగ్గర గతంలో లేనంతగా బాంబులు, క్షిపణులు ఉన్నాయని వెల్లడించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా మాకు భారీ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉంది. అవసరమైతే మా ఆయుధ సంప్తి ఎప్పుడైనా ఉపయోగించగలం.
ప్రస్తుతం మేం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కంటే ప్రస్తుతం రెట్టింపు ఆయుధ నిల్వలు ఉన్నాయి. దాడులు ఆపినంత మాత్రాన.. యుద్ధం ముగిసినట్లు కాదు.
అమెరికా యుద్ధనౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని.. అయితే దానితో తాను సంతోషంగా లేనని చెప్పారు. ‘‘వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. కానీ నేను దానితో సంతృప్తిగా లేను. ఏం జరుగుతుందో చూద్దాం.’’ అని అన్నారు. ఇరాన్ కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుందని.. అయితే చివరికి ఏదైనా ఒప్పందానికి రాగలదో లేదో తనకు కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్రంగా విచ్ఛిన్నమైందన్నారు. అన్ని వర్గాలు ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నాయని అంగీకరించినప్పటికీ.. ఈ విభజన చర్చల్లో ఇబ్బందులను కలిగిస్తోందని ట్రంప్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global security news
  • Iran ceasefire news
  • Iran US ceasefire
  • Middle East Tensions
  • Trump Iran war end

తాజావార్తలు

  • Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన

  • EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్

  • Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్‌ సర్వే!

  • Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!

  • Pickleball Players’ Plane Crash: టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions