ఈ ఏడాది పొన్నియన్ సెల్వం 2 తో మంచి విజయం అందుకున్న త్రిష ఆ తరువాత వచ్చిన లియో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది. ఈ మూవీస్ తో కోలీవుడ్ లోకి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన త్రిష తాజాగా బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీ లో ఓ బిగ్ హీరో సరసన నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆ బిగ్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్..పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ హీరోగా “ది బుల్” పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా వున్న త్రిష బాలీవుడ్ లో ఇప్పటివరకు ఒకే ఒక సినిమా చేసింది.
2010లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. కట్టా మీటా తర్వాత హిందీలో అవకాశాలు వచ్చినా కూడా త్రిష సౌత్ లో బిజీ గా ఉండటం తో ఆ ఆఫర్స్‌ను తిరస్కరించింది. ది బుల్ మూవీకి కరణ్ జోహార్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.. దాదాపు 25 ఏళ్ల అనంతరం సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటం తో సినిమా పై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది..అయితే త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో ఎంతో బిజీ హీరోయిన్ గా మారారు. ఈ భామ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఓ బిగ్ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ బిగ్ మూవీ ఏదంటే మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న “మెగా 156” సినిమా లో త్రిష హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి..