బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వానలతో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటాడు ఓ గిరిజనుడు. పెదబయలు పెదకొండపల్లి పంచాయితీ చెక్కరాయి వద్ద తన బిడ్డను బుజాన ఎక్కించుకొని పీకల్లోతు వాగు దాటాడు. వాగులోంచి సురక్షితంగా ఒడ్డుకు చేరారు తండ్రీ కొడుకులు.