Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 84 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి వీర విహారం స్పష్టించిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. ఇలా అంతర్జాతీయ వేదికలపై ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ తన భీకరమైన ఫామ్‌ను కొనసాగిస్తుంటే, మరోవైపు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. నిన్న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా తమ దేశాల జట్ల తరఫున బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు సన్‌రైజర్స్ విధ్వంసకర వీరులు ప్రస్తుతం అసాధారణమైన ఫామ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నారు.
Also Read
- Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జట్టు తరఫున ప్రత్యర్థి బౌలర్లపై వీరు సృష్టించిన విధ్వంసం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. ఇప్పుడు సరిగ్గా అదే దూకుడును అంతర్జాతీయ క్రికెట్లోనూ ప్రదర్శిస్తూ ఈ కాటేరమ్మ కొడుకులు తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలింగ్ దాడిని చిత్తుచేస్తూ పరుగులు మంచుకొండలా మారుస్తుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీ స్టార్ల ఇలాంటి పూనకం లాంటి ఆటతీరుతో తమ అభిమాన జట్టు భవిష్యత్తుపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఒకే జట్టు తరఫున ఆడి లీగ్‌ను హోరెత్తించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తమదైన శైలిలో రికార్డులను తిరగరాస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..