బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ట్రైనీ ఇన్ స్పెక్టర్. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అదే సంస్థలో శిక్షణ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్. ఈ కేసులో నసీముద్దీన్ కు సహకరించిన దమ్మాయిగూడ కు చెందిన మరొక శిక్షణ ఇచ్చే ఇన్స్పెక్టర్ సల్మాన్. యువతి పై అత్యాచారం జరిపి వీడియోలు ఫోటోలు తీసుకుని పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు నసీముద్దీన్.
Also Read:Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..
ట్రైనింగ్ కోసం వచ్చిన యువతిని మాయ మాటలతో లొంగ దీసుకున్న ట్రైనర్ నసిముద్దీన్. పలు మార్లు వేధింపులకు పాల్పడడంతో యువతి ట్రైనింగ్ ఆపేసింది. 2025 అత్యాచారం జరిగిన ప్రాంతం బేగంపేట పరిధిలో ఉండడం తో బేగంపేట పోలిస్ లకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. జనవరి 2025 నుండి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బేగంపేట పోలీసులు నసీముద్దీన్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.