Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్లాసిక్ ‘సీతారామం’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటన అందరినీ ఎంతలా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఇబ్బంది పెట్టినందుకు సుమంత్ ఇప్పుడు క్షమాపణలు కోరడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా.. తాజాగా అడివి శేష్ ‘డెకాయిట్’ (Dacoit) ప్రమోషన్లలో పాల్గొన్న సుమంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ‘సీతారామం సినిమాలో నేను మృణాల్‌కు క్షమాపణలు చెప్పే ఒక కీలకమైన సీన్ ఉంది. కానీ నిడివి కారణాల వల్ల ఎడిటింగ్‌లో ఆ సీన్‌ను తొలగించారు. ఆ పాత్ర పరంగా ఆమెకు సారీ చెప్పలేకపోయాననే ఫీలింగ్ నాలో ఉండిపోయింది’ అని సుమంత్ తెలిపారు.
Also Read : Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
అంతేకాకుండా, మృణాల్‌కు ఆ ‘సారీ’ని మరో రూపంలో తీర్చుకున్నానని ఆయన చమత్కరించారు. “అందుకే ‘డెకాయిట్’ సినిమాలో మృణాల్‌కు ఛాన్స్ వచ్చేలా నేనే రికమండ్ చేశాను. అలా ఆమెకు సారీ చెప్పినట్లయ్యింది” అంటూ నవ్వుతూ వెల్లడించారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా థ్రిల్లర్‌లో సుమంత్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘సీతారామం’ తర్వాత మృణాల్, సుమంత్ కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాలో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!